గురు దేవులు లేకుంటే
అజ్ఞానం ముదురదా!
విజ్ఞానం అడవి గాచిన
వెన్నెలలా అవ్వదా!
గురువు లేని విద్య గ్రుడ్డిది
ఖచ్చితంగా అవ్వదా!
అభివృద్ధి ఆదిలోనే
ఇక అంతరించిపోదా!
గురు దేవులు ఉంటేనే
విజ్ఞానం విలసిల్లేది
అజ్ఞానం అంతమయ్యేది
మేధో సంపత్తి పెరిగేది
సమ సమాజ స్థాపకులు,
నవ సమాజ నిర్మాతలు
వాస్తవమే గురు దేవులు!
చేయాలోయ్! కైమోడ్పులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి