అక్షర సత్యాలు;- -'బాలబంధు' గద్వాల సోమన్న,9966414580.
కిలకిలమని నవ్వితే
సొగసు పెరిగిపోతుంది
గలగలమని పలికితే
తేనె చినుకు కురుస్తుంది

మనసు వీణ మీటితే
మమకారం పుడుతుంది
చేయి చేయి కలిస్తే
చేయూత ఉదయిస్తుంది

క్షమాపూలు రువ్వితే
శత్రుత్వం పోతుంది
ప్రేమ ధార చిందితే
ప్రపంచం మారుతుంది

అనుమానం నశిస్తే
పెనుభూతం వదలుతుంది
నమ్మకం చిగురిస్తే
బంధం బలపడుతుంది
 


కామెంట్‌లు