కనిపించును కటువుగా
కన్నతండ్రి మాటలు
దండలో దారంలా
దాగుండును మమతలు
కరుగును క్రొవ్వొత్తిలా
కుటుంబం క్షేమకై
రుధిరాన్ని ధారవోసి
తన బిడ్డల భవితకై
ఇష్టాలను దాచుకొని
కష్టాలను మోసుకొని
అహర్నిశలు శ్రమించును
నాన్న మనసు తపించును
భుజాలపై మోసుకొనును
గుండెలపై ఆడించును
గట్టిగా చేయి పట్టుకొని
భద్రంగా నడిపించును
చిగురుటాకులా వణకును
చాలా గాబరా పడును
పిల్లలకు వ్యాధులొస్తే
తండ్రి మది తల్లడిల్లును
నాన్న గారి మనసు వెన్న
వారిముందు కడలి చిన్న
త్యాగానికి చిరునామా!
సదా ఇల స్మరిద్దామా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి