అమ్మకెంత ఆశ !; - కోరాడ నరసింహా రావు.
అమ్మకెంత ఆశ.... !
శ్రీ కృష్ణాష్టమి వచ్చిందంటే... 
 అన్నను - నన్ను... 
   చెంతకు పిలిచి... 
 బలరామ - కృష్ణులే మీరంటుంది... !
 మమ్మచ్చం అలాగే తయారు చేస్తుంది.. !!

అమ్మకెంత ఆశ.... !
   శ్రీరామనవమి వచ్చిందంటే 
  రామలక్ష్మణులు మీరంటుంది 
  ఏనాడూ విడిపో వద్దంటుంది!!

అమ్మకెంత ఆశ.... !
   సెప్టెంబరు 5. వచ్చిందంటే... 
 అచ్చం మా తెలుగు టీచరు లా 
అన్నను, నన్ను తయారుచేసి... 
  బడికితీసుకు వెళుతుంది 
  అందరూ మమ్ము పొగుడుతు ఉంటే... ఎంతో ఆనందిస్తుంది !!

అమ్మకు ఎంత ఆశ.... !
 గొప్పవారి కథలెన్నో చెబుతూ 
మేమూ  గొప్పవారు కావాలంటుంది...!శ్రద్దగా చదువు కో మంటుంది  !!

మా స్కూలు బేగులూ... 
    లంచు బాక్సులూ... 
 అమ్మే మోసుకొస్తుంది.... 
  మము రోజూ... 
.. బడికి  తెస్తుంది !!

అమ్మకెంత ఆశ.... !
 మాకై కల లెన్నో కంటుంది... 
   మాకోసమే... తను బ్రతుకుతోంది !!
        *******************

కామెంట్‌లు