"శిరినవ్వులు";- కొప్పరపు తాయారు
పూఅందాలు పూపరిమళాలు
మనసుకి అమితానందకరం
మల్లెల వేళ వెన్నెల కురిసెడి
వేళ, మల్లెల గుబాళింపులు,

మనసుని దోచు సమయాన
మధుర మంజుల మురళీ గానం
మనసు నలరింప మదిలో మెదిలే

రాధా మాధవియం మల్లెపువ్వు 
వాసన మనుగడకే అపురూపం
మదిలో భావనల కవ్వింత లిడు
వెన్నెల రాత్రులలో, మల్లెల

విప్పారిన కనుల సైగలు
మదిని మురిపింప అమిత
ప్రేమా వాహినిగా నింపు
హృదయ పీఠికపై పరమాత్మ 

స్వరూపం ఏమి దైవత్వం
అందుకే మల్లెలు మనసుని దోచు
మనసు భగవంతుని తలచు
ప్రకృతి మాత వరాల బిడ్డ!!

ఈ మల్లెల నునుసిగ్గుల
తెల్లని పూలు అలరించ
ఏ తెంచె అందరి హృదయాలు
పరిమళాల నింప!!!

కామెంట్‌లు