చిరుతల భజన (బాల గేయం)- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
భక్తులందరు వచ్చారు
ముక్తిని కోరుతూ వారంతా
చిరుతలు చేతబూనారు
కాళ్లకు గజ్జలు కట్టారు!!

ఆడుతు పాడుతు వారంతా
భక్తితో భజనలు చేశారు
గోపాల గోపాల అనుకుంటూ
కృష్ణుని భజనలు చేశారు!!

కాళీ గజ్జలు గల్లునమోగగా
కలిసి మెలిసి వారంతా
రామ రామ అనుకుంటూ
రామ భజనలు చేశారు!!

సీతను తలచి వారంతా
చిందులు వేసి ఎగిరారు
హనుమను తలచి వారంతా
హాయిగా భజనలు చేశారు!!

పాటలు పాడిన భక్తులకు
పాపాలన్నీ పోతాయి
భజనలు చూసిన భక్తులకు
బ్రహ్మ పుణ్యము వస్తుంది !!


కామెంట్‌లు