ఆహా ! ఎంత మంచి ప్రదేశము;- కుమ్మరి అనురాధ -పదవ తరగతి - ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాజభవన్ సోమాజిగూడ హైదరాబాద్
 పిల్లల మాటలు 
పెద్దల ముచ్చట్లు 
పిల్లల ఆటలు 
పెద్దల పాటలు 
పిల్లలకు నచ్చినది 
పిల్లలంతా మెచ్చినది
 పచ్చటి ఆకులతో 
 పిల్లల కేకలతో 
 ఎంత ముద్దుగా ఉన్నది చూడు తోట 
 పక్షుల కిలకిలలు 
 నీళ్ల చప్పుడు 
 అదిగో ఎంత ముద్దుగా ఉంది చూడు పండు అని పిల్లల కేకలు
 నాకంటే నాకు అని పిల్లల ఏడుపులు 
 తల్లుల బుజ్జగింపులు 
 తండ్రుల తిట్లు 
 ఇదంతా పోగా పిల్లల సంతోషం 
 నోరూరించే పండ్లు 
 తియ్యటి నీళ్లు
  పచ్చని చెట్లు 
  అదిగో పచ్చటి తోట 
  మాకు నచ్చిన బాట

కామెంట్‌లు
donepudi naresh babu చెప్పారు…
బాగుంది
అజ్ఞాత చెప్పారు…
మంచిగుంది
ఉజ్వల భవితవ్యానికి సోపానం
బెండి ఉషారాణి చెప్పారు…
చిరుప్రాయంలోనే ఇంత మంచి కవితను రాసిన నీకు అభినందనలు తల్లి! నీకు ఇంతటి పాండిత్యాన్ని అందించిన ఉపాధ్యాయులకు కూడా వందనాలు!!
ముత్యాల రవీందర్ చెప్పారు…
కవితా బాగుంది. ఇంకా రాయాలి మరిన్నీ..
కల్వకోట వేంకట సంతోష్ బాబు చెప్పారు…
కవిత బాగుంది. అభినందనలు .కృషి కొనసాగించు.
ప్రకృతి పట్ల ప్రేమతో
పూవుల తోటలో చిన్నారి!
నీ వెపుడూ విహరించాలి.
కవితల పూవులతోటలోను
నీవు విహరిస్తూ అందరినీ
మైమరపించగల వని
నా నమ్మకం...

~డా.వెలుదండ సత్యనారాయణ
అజ్ఞాత చెప్పారు…
Really good 😊, the rhyming used here is creative , this gives pretty good vibes and hope you continue writing కవిత like this wish you all the best sis 💫🤞.
BINDU SRI K చెప్పారు…
బాగుంది
మువ్వల రాంబాబు చెప్పారు…
చక్కని అందమైన కవిత ..
చిన్నారివైనా చిరు దీపానివి..
రాస్తూ ఉండు ....
భావితరానికి మరో రచయిత్రి గా వెలుగొందు
ఆయుష్మాన్ భావం 🙌🙌🙌
Dr. Gollapelli Ganesh చెప్పారు…
బాగుంది ... all the best అనురాధ