న్యాయాలు -264
వృశ్చికీ గర్భ న్యాయము
**********
వృశ్చికము అంటే తేలు. వృశ్చికీ గర్భము అంటే తేలు గర్భము దాల్చి పిల్లలు పుట్టిన వెంటనే తల్లి తేలు చనిపోతుంది.
తేలు పిల్లలు తల్లి గర్భమును చీల్చుకుని బయటకు వస్తాయి. అలా పిల్లలకు జన్మనిస్తూనే తల్లి తేలు మరణిస్తుంది.
అలా తనకు మరణం వుంటుందని తెలిసీ, నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి మరణించిన తల్లిని గురించి ప్రస్తావిస్తూ ఈ "వృశ్చికీ గర్భ న్యాయము"తో పోలుస్తూ ఉంటారు.
సృష్టిలో మాతృత్వం ఓ వరం లాంటిదని అంటారు. వివాహ బంధముతో ముడిపడిన జంటను పెద్దలు "శీఘ్రమే సంతాన ప్రాప్తి రస్తు" అని దీవిస్తూ వుండటం మనందరికీ తెలిసినదే.
అలా పెళ్ళయిన దంపతులు తమ దాంపత్యానికి గుర్తుగానూ అలాగే వంశాభివృద్ధి, జాతి అభివృద్ధి కోసమూ సంతానం కోసం తపిస్తూ వుంటారు.
ఇది ఒక మానవ జాతికే పరిమితం కాలేదు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణీ సంతానం కోసం పరితపిస్తుంది.
అయితే ఈ సృష్టిలో, జీవరాసుల్లో కొన్ని తమ సంతానానికి జన్మనిస్తూ మరణించడం మన పూర్వీకులు ఆనాడే గమనించి చెప్పడం విశేషం.అలా వారు ఓ ఐదింటిని గమనించి వాటన్నింటినీ కలిపి "అళీ కుళీ వృశ్చిక వేణు రంభాః/ వినాశకాలే ఫల ముద్భవంతి" అనే వాక్యంలో చెప్పారు.
అళీ అంటే తుమ్మెద.,కుళీ అంటే పీత/ కర్కటము/ ఎండ్రకాయ.వృశ్చికము అంటే తేలు. వేణు అంటే వెదురు. రంభా అంటే అరటి చెట్టు... ఇవి గర్భం ధరించేది చివరి దశలోననీ, అలా అవి తమ సంతానాభివృద్ధి చేస్తూ మరణిస్తాయని నిశితంగా పరిశీలించి చెప్పారు.అరటి చెట్టు ఒకే ఒక్క గెల వేయడం, ఆ తర్వాత దానిని నరికి వేయడం మనందరికీ తెలిసిందే.
ఇలాంటివి గమనించే మనవాళ్ళు వృశ్చికీ గర్భ న్యాయము, కర్కటీ గర్భ న్యాయములను సృష్టించారు.
అయితే మనం న్యాయా శుభాశుభాల కోణాల్లోంచి కూడా చూస్తుంటారు.ఒకటేమో సంతానం ఈ లోకంలోకి రావడమనేది శుభానికి గుర్తు ఆని భావించడం అలాగే ఆ సంతానాన్ని అందించిన మాతృమూర్తి మరణించడం అశుభానికి చిహ్నమని చెప్పడం వింటుంటాం.
ఐతే శుభమా! అశుభమా అని కాదు కానీ తల్లిని కోల్పోయిన బిడ్డది ఎంత దురదృష్టమో కదా! ఆ బిడ్డను పెంచే వారికి కూడా భారంగానే ఉంటుంది.అందుకే అలా అంటుండవచ్చు.
ఇలా "పుట్టగానే తల్లిని కోల్పోయిన బిడ్డను చూసి తల్లిని మింగిన నష్ట జాతకుడనీ" తిడుతూ వుండటం. అలాగే ఆ తల్లి గురించి బాధ పడుతూ "ఎన్ని నోములు నోచిందో, ఎంత తపించిందో సంతానం కోసం, కళ్ళనిండా చూసుకోకుండానే కన్నుమూసిందని" జాలిపడటం. నిత్యజీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొందరలా అనుకోవడం చూస్తుంటాం .
ఇదండీ "వృశ్చికీ గర్భ న్యాయము" అంటే... సృష్టిలో ఇలాంటివి చూసినపుడు ఎవరికైనా ఆశ్చర్యంతో పాటు మనసులో "అయ్యో !" అని అనిపించక మానదు కదా!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి