విజయాలకు మూలం ;- కోరాడ నరసింహా రావు !
మనిషైనా... వాహనమైన... 
 అదుపుతప్పితే..., 
  అంతే  సంగతులు !

నియంత్రించ గలిగే  సామర్ధ్యం 
ఉంటేనే... మనమైనా... 
  మనల్ని నమ్ముకున్న వారైనా 
 క్షేమంగా గమ్యం చేరగలిగేది !

సరైన అవగాహన లేకుండా... 
 అంచనాలు వేస్తే..., 
    ఇలాంటి అనుభవాలు... 
 ఎదురు కావటం సహజమే కదా.... !

ఇలాంటి అనుభవాలే... 
  మనుషులకు గుణపాఠాలై 
   సమస్యలనెదుర్కోవటంలో 
  రాటుదేల్చుతాయి అనేది.... 
   అనుభవైకవేద్యమే... !!

మనిషి జీవితమే.... 
   జయాపజయాల... 
      సమ్మి శ్రీతo.... !!

అపజయాలకు,- అవమానాలకు కృంగిపోక... 
  ముందుకు సాగిపోవలసిందే!
       ప్రతి అపజయానికీ... 
 రెట్టించిన పట్టుదలే... 
   మనిషి విజయాలకు మూలం 
.....*******


కామెంట్‌లు