విద్యార్థులకు ఉపాధ్యాయుడే నిజమైన పాఠ్యగ్రంథమని, తన స్వర్ణమంటి భవిష్యత్తుకు నిరంతరమూ స్ఫూర్తిదాయకంగా నిలిచేది ఉపాధ్యాయుడేనని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.
పాఠశాలలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.
తొలుత ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్ధిణీ విద్యార్థులు తమకు పాఠాలు బోధిస్తున్న ఇరవై మంది ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులను జ్ఞాపికలతో సత్కరించారు.
ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయ సిబ్బంది కార్యదర్శి తూతిక సురేష్ లను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ఈ గురుపూజోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులకు ఇటీవల నిర్వహించిన వాలీబాల్,
షటిల్ బ్యాట్మెంటన్, టగ్గాఫ్ వార్, క్యారమ్స్, పాటల, అంత్యాక్షరి, రన్నింగ్ తదితర పోటీల విజేతలైన టీచర్లకు, ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు చేతులమీదుగా బహుమతులను అందజేసారు.
ఉపాధ్యాయులంతా సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఉపాధ్యాయ వ్యవస్థకు మార్గదర్శకం అనే అంశంపై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్ముంనాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు. ఈ పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావును ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు.
తెలుగు ఉపాధ్యాయులు ముదిల శంకరరావు ప్రార్ధనాగీతం ఆలపించగా, తెలుగు ఉపాధ్యాయులు వల్లూరు లక్ష్ముంనాయుడు వందన సమర్పణ గావించారు. బాలబాలికల పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సభికుల ప్రశంసలు పొందాయి.
అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి