‌అటల్ జీ ప్రశంసలు పొందిన త్యాగశీలి! అచ్యుతుని రాజ్యశ్రీ
ఆయన నవోజ్వల భారతమహానాయకుడు.1977లో ఆయనకి నివాళిగా పోస్టల్ స్టాంపు విడుదల ఐంది.ఆయన మంచి వక్త రచయిత పత్రికా విలేఖరి దేశంకోసం శ్రమించి తపించిన దధీచి ఆజన్మ బ్రహ్మచారి.సెప్టెంబర్25న పుట్టిన  బాబుని దీనాఅని పిలిచే వారు.ఓతమ్ముడుశివా.తండ్రి  నాల్గు ఏళ్ల తర్వాత తల్లి ఆపై తమ్ముడు కూడా మరణించడంతో ఆచిన్నారి బాగా కృంగిపోయాడు.అమ్మమ్మ తాతల దగ్గర పెరిగాడు.ఒకసారి దొంగలు పడితే ఆబాబులేచాడు.మెలుకువవచ్చిన ఆబాలుడు "దొంగలు డబ్బున్నవారిని దోచుకుంటారని విన్నాను.మేము బీదవాళ్ళం.మాదగ్గరేమీలేదు" అనటంతో వారు వెళ్లి పోయారు.మేనమామకి టి.బి.వస్తే వైద్యం చేయడానికి అంతా నిరాకరించారు.10ఏళ్ళ ఆచిన్నారి బడిమానేసి ఆయనతో లక్నో వెళ్ళారు వైద్యం కోసం.సరిగ్గా పరీక్షలటైంలో  మామతో తిరిగి వచ్చి 6వక్లాస్ ఫస్ట్ డివిజన్లో పాసైనారు.మామయ్యకొడుకు తన క్లాస్మేట్.అతని పుస్తకాలు చదివి మెట్రిక్ పాసైనారు.
సీకర్ మహారాజు ఆయనకు బంగారు పతకం నెలనెలా 10రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడంతో పిలానీలోఇంటర్ లో ఫస్ట్ వచ్చి రికార్డు నెలకొల్పారు.తనదగ్గరకు వచ్చే తోటి పిల్లలకు చదువు చెప్పే వారు.ఘనశ్యాంబిర్లా గోల్డ్ మెడల్ తో సత్కరించి ఉద్యోగం ఇస్తానని అంటే వద్దు అని తిరస్కరించి కాన్పూర్ లో బి.ఎ.ఎం.ఏ.ఆగ్రాలో చదివారు.కానీ దగ్గర బంధువు అకాలమరణం తో ఎం.ఏ.పరీక్షలు రాయలేదు. ధోతి కుర్తాటోపితో ఆర్.ఎస్.ఎస్.కార్యకర్తగా పనిచేశారు.
లక్నోలో రాష్ట్రధర్మ పాంచజన్య స్వదేశ్ పత్రికల సంపాదకుడు కంపోజర్ పేపర్ బాయ్ గా
 పనిచేశారు.అన్నీ తానే ! శ్యాంప్రసాద్ ముఖర్జీ కి ఆప్తుడు.
పాసింజర్ రైలు లో కూర్చుని రచనలు చేసేవారు.డాక్టర్ హెడ్గేవార్ జీవిత చరిత్ర ను మరాఠీలోంచి హిందీ లోకి అనువాదం చేశారు.కానీ అందులో తనపేరు ప్రచురించకూడదని నిక్కచ్చిగా చెప్పారు.సామ్రాట్ చంద్ర గుప్త అన్న పుస్తకంని ఒకే ఒక్క రాత్రి లో రాశారు అంటే నమ్మబుద్ధి కాదుగదూ? 11ఫిబ్రవరి1968లో లక్నో నుంచి పాట్నా వెళ్లే రైలు ఎక్కారు.ఆమర్నాడు మొగల్సరాయ్ స్టేషన్ లో బట్టలో చుట్టిన ఆయన శవంని చూసి అంతాభోరుమన్నారు.
శ్రీ వాజ్ పాయ్ ఇలా నివాళి అర్పించారు " ఆయన దేహం నుండి కారిన రక్తపు బొట్టు మననుదుట తిలకం గా మారాలి.ఆయన చితిమంటలు 
మన గుండె లో దీపాలు.ఆయన నవ దధీచి!
🌷
ఆ అభినవ దధీచి శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ.యు.పి.లో నాగ్లాచంద్రభాను అనే పల్లెలో పుట్టారు.తల్లి రాంప్యారీ.తండ్రిభగవతీ ప్రసాద్ 🌷

కామెంట్‌లు