శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 విష్ణు మాయనే యోగమాయ అంటారు.దేవకికి 7వసంతానం యోగమాయ ని కంసుడు బండపై విసిరేసి చంపాలనుకుంటాడు.ఆమె అష్టభుజ మాతగా వెలిసి కంసుని హెచ్చరించి ఆకాశంలోకి మాయమౌతుంది.
ఇంకొన్ని కథలప్రకారంనంద యశోద లకూతురుగా పుట్టింది
యోగేశ్వర అంటే శ్రేష్ఠమైన యోగి.కృష్ణుడు శివుని యోగేశ్వర అంటారు.హిమాలయంలోశివుని కూడా ఆపేరు తో పిలుస్తారు.పురాణాల్లో గొప్ప యోగులు శుక్రాచార్యుడు నారాయణ ఋషి అంతరిక్ష ప్రబుద్ధ పిప్లాయన ఆవిహోత్ర దుమిల చమస కరభాజన.
యోని అంటే అర్థం దేహం శరీరం.పురాణాలప్రకారం 64లక్షల యోనులున్నాయి.మనుషులు24లక్షలు జలచరాలు 6లక్షలు ఖేచరాలు 8లక్షలుక్రిమికీటకాలు11లక్షలు పశువులు 8లక్షలు స్థావరాలు 24లక్షలు.
యోని ముద్ర అంటే తాంత్రిక పూజలో చేతి వేళ్ళతో యోని ఆకృతి లో పెట్టడం అన్నమాట.
మొహాన మొటిమలను హిందీలో యౌవనకంటకం అంటారు.టీనేజ్ పిల్లల మొహాన ఇవి వచ్చి సతాయిస్తాయి.వాటిని గిల్లితే కోతిపుండు బ్రహ్మ రాక్షసి అవుతుంది.🌹

కామెంట్‌లు