ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక సమ్మేళనానికి సత్యవీణా మొండ్రేటి


 ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి హైదరాబాద్ కీ చెందిన శ్రీమతి ప్రముఖ కవయిత్రి సాహితీ వీణా కుసుమాల వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి సత్యవీణా మొండ్రేటి  గారిని తానా సంస్థ వారు ఆహ్వానించారు. 
 ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపుకి తానా
 ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూరకి సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ కి శ్రీమతి సత్యవీణా  మొండ్రేటి గారు ధన్యవాదాలు తెలియజేశారు సత్యవీణ మొండ్రేటి గారు
 దాదాపు 1500 కవితలు 250 కథలు బాల సాహిత్యం ,ప్రాస కవితలు ,గజల్స్ ,రుబాయిలు ఇష్టపదులు రచించారు ఎన్నో వాట్స్అప్ గ్రూపులకు తమ రచనలను అందించారు .తన సమూహంలో కవులను ప్రోత్సహిస్తూ దిగ్విజయంగా సమూహాన్ని నడిపిస్తున్నారు ఆమె గ్రంథాలు రెండు ప్రచురితం . 12లఘు ప్రక్రియల ద్వారా సత్యవాక్కులు గ్రంధాన్ని 2022లో ప్రచురించారు దానికి కర్ణాటక ఆంధ్ర ప్రభుత్వాల అవార్డులు వచ్చాయి... 
రెండో గ్రంథం 'వీణానాదాలు'
కవిత కుసుమాలు
 2003లో 2
 ప్రచురితమైనది .తమ కవిత్వం ద్వారా కధల ద్వారా కవితల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నారు తానా వారు నిర్వహిస్తున్న ఈ భాషా దినోత్సవ కార్యక్రమం యఫ్ టీవీ ద్వారా అనేక యూరప్ దేశాల్లో ప్రత్యక్ష ప్రచారం అవడం కాకుండా తానా అధికారిక యూట్యూబ్ ఫేస్బుక్ చానల్స్ లో ఈ టీవీ భారత్ వంటి దాదాపు పది యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రచారం అవుతుంది శ్రీమతి సత్యవీణమొండ్రేటి గారికి అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల పలువురు పెద్దలు కవి పండితులు సాహితీవేత్తలు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు..

కామెంట్‌లు