సుప్రభాత కవిత -బృంద
తూరుపు గిరుల మకుటముగా
గగనపు మైదానమున బంతిగా
మబ్బుల జడలో పూబంతిగా
అబ్బురముగ తోచే భానుడు

అడుగులకు ఆసరాగా
పయనమునకు మిత్రుడిగా
గమనములో  గతులుగా
గమ్యానికి చేరువ చేసే.....

ఆలోచనకు విచక్షణ నిస్తూ
నిర్ణయాలకు బలాన్నిస్తూ
అనుభవాలకు ఓర్పునిస్తూ
అనుభూతులను  పోగు చేస్తూ

కదిలిపోయే కాలచక్రపు
కనుసన్నలలో నడుస్తూ
కదలికలు కఠినమవకుండా
మసలుకునే సహనమిస్తూ....

నేనూ నాదనే భావన కాక
మనమూ మనదను మనసుతో
అందరి క్షేమము ఆశించీ
అందరిలో మనమూ కలిసి

హాయిగే సాగే వరమిచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు