మహోన్నత వ్యక్తిత్వం! అచ్యుతుని రాజ్యశ్రీ

 రైతుబిడ్డ మహానెమ్మది! అన్న కి లక్ష్మణస్వామి!ఆపల్లె మౌల్వీ దగ్గర అక్షరాలు దిద్ది సంస్కృతం హిందీ బెంగాలీ ఆంగ్లంలో పట్టుసాధించిన మహామేధావి! మెట్రిక్ మొదలు ఎం.ఏ.లా లో కూడా ఫాస్ట్  ఫస్ట్ బెస్ట్! ఐ.సి.ఎస్.కోసం లండన్ వెళ్లాలి అని కోరుకున్న
ఆయువకుడు నాన్న అనారోగ్యంతో ఇంటిబాధ్యతతో
మానుకున్నారు.వకీలుగా పేరు పొందారు.అశుతోష్ ముఖర్జీ ఆయనని లా  కాలేజీ ప్రొఫెసర్ గా నియమించారు.1914లో బీహార్ జలప్రళయం
భూకంపం సమయంలో ఆయన చేసిన సేవ నిరుపమానం.హజారీ బాగ్ జైల్లో ఆంగ్ల ప్రభుత్వం
15నెలలు పెట్టినప్పుడు ఆరోగ్యం పూర్తిగా క్షీణించినా
రాత చదువు లో గడిపారు.గంగానది కి ఉత్తరాన 12జిల్లాల్లో భూకంపం వచ్చింది.జైలు నుంచి విడుదల ఐన ఆయన కోడలు చనిపోయిన వార్త తెలిసి బైలుదేరారు.కానీ పాట్నా లో హఠాత్తుగా ఆందోళన చెలరేగడంతో అక్కడ శాంతి పునరుద్ధరణ కోసం ఆరోగ్యంని కూడా లెక్క చేయలేదు.1934లో అన్ని చనిపోటంతో 70వేలరూపాయల అప్పు కూడా మీద పడింది.ఢాకాలోదోపిడీలు గృహ దహనాలు జరిగితే 
శాంతి స్థాపనకు పరుగులు తీశారు.గాంధీజీ ప్రభుత్వ పాఠశాలల్లో చదవవద్దని చెప్పడంతో ఈయన జనతాపాఠశాలలు సదాకత్ ఆశ్రమం స్థాపించారు.ఇంతటి మహామనీషి పూర్తి జీవితం చదివితే కనులవెంట నీరు రాక మానదు.ఆయన మనదేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్.సోదరి చనిపోతే రోజంతా ఉపవాసం ఉండి జనవరి26న పెరేడ్ కి హాజరై సాయంత్రం యమునాతీరంలో  కర్మకాండలు చేశారు.
కామెంట్‌లు