భగవంతుని కృప - సి.హెచ్.ప్రతాప్

మనం బయటి ప్రపంచంలో నిజమైన మరియు శాశ్వతమైన ఆనందాన్ని కనుగొనలేము. ఎందుకంటే శాస్వతమైన ఆనందం అది మన అంతరంగంలోనే నిక్షిప్తమై ఉంటుంది. నిజమైన మరియు శాశ్వతమైన ఆనందాన్ని జ్ఞానం, ధ్యానం మరియు దైవానుగ్రహం ద్వారా మాత్రమే పొందవచ్చు మరియు హృదయపూర్వక హృదయంతో శోధించే మరియు ప్రయత్నించే వ్యక్తి మాత్రమే సాధించగలడు అని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తున్నట్లుగా భగవంతుని కృప అన్ని ప్రదేశాలలో, అందైపై , అన్ని వేళలా ఎటువంటి తారతమ్యాలు లేక వుంటుంది. అత్యంత శ్రద్ధాలుడై , అంతరాత్మ యందు భగవంతునితో అనుసంధానము చెంది, భక్తితో నిరంతరము నన్నేభజన చేయువాడు అందరి యోగులలోను అత్యంత శ్రేష్ఠుడు. అతడు చేయు ప్రతి పనిలోనూ భగవంతుని చూస్తుంటాడు. ఇటువంటి యోగి నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని భగవంతుడు భగవద్గీత ద్వారా మానవాళికి తెలియజేసాడు. పూర్వ, ప్రస్తుత జన్మలో దుష్కర్మ ఫలితాలు  పోగొట్టు కోవడానికి ఎలా కష్టపడుతామో అదే విధంగా భగవంతుని పైన కూడా విశ్వాసం ఉంచి భగవంతుని ధ్యాని స్తూ, స్తుతిస్తూ ఉంటే తప్పక కష్టాలు, ఇబ్బందులు దూరమవుతాయ. బాకు తో తగలాల్సిన దెబ్బ చిన్న గుండు సూది తగిలి నట్టుగా తగిలి దూరమవుతుంది. భక్తుని హృదయం పూర్తిగా భగవంతునితో నిండిపోయినప్పుడు, భగవంతుడు కూడా భక్తునిపై ప్రేమను సంపూర్ణంగా ప్రదర్శిస్తాడు. అది పతివ్రత అయిన స్త్రీ తన పతిని అంటిపెట్టుకునియున్నట్లు. అప్పుడు పతి కూడా తన పత్ని పట్ల విపరీతమైన ప్రేమను ప్రదర్శిస్తాడు.
కామెంట్‌లు