పుస్తకం;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పుస్తకం తెరిస్తే అక్షరాల పూలపరిమళం 
పుస్తకం తెరిస్తే అనుభవాల తేనె ఊటలు
పుస్తకం తెరిస్తే అదృశ్య చిత్రాల విందు
పుస్తకం తెరిస్తే జ్ఞానవీచికల ఝరి
పుస్తకం తెరిస్తే ఆలోచనల భృంగనాదాలు
పుస్తకం తెరిస్తే సిద్ధాంతాల మర్మవాదాలు
పుస్తకం తెరిస్తే సంతోషాల గేయాలు
పుస్తకం తెరిస్తే చరిత్రల గాయాలు
పుస్తకం తెరిస్తే ఇజాల జాతర
పుస్తకం తెరిస్తే నిజాల పాతర
పుస్తకం ఒక నిశ్శబ్ద గురువు
పుస్తకం తపస్సులో ఉన్న మౌని
పుస్తకం ఒక విజ్ఞాన ఖని
పుస్తకం ఒక జ్ఞాన మణి!!
*********************************

కామెంట్‌లు