త్రిమూర్తిరూపం
ముగురమ్మల మూలధనం
ఇలనడిచే జ్ఞానసాగరం
నిలువెత్తు ధర్మనిలయం
బతుకువిలువల విన్యాసాలను
విడమరచే జీవితపాఠాలను
నేర్పించే నిండుహృదయం
కదిలేది కదిలించేది
నినుదారిలొ నడిపించేది
దారిదీపమై వెలుగొందేది
జ్ఞానాంబుధిలో ముంచెత్తేది
కోపంతో కరుణించేది
శాపంతో వరమిచ్చేది
మాటలతేనెలు కురిపించేది
పరబ్రహ్మమై దీవించేది
తనశిష్యుల కళ్ళల్లో
వెలుగుల తళుకులకోసం
తనజీవితాంతం పరిశ్రమించేది
తననోడించే అంతేవాసికోసం
అహర్నిశలు పరితపించేది
దేవుడుకోపిస్తే గురువు కాపాడగలడు
గురువుకోపిస్తే ఆ దేవుడేంచేయలేడు
అందుకే గురువాజ్ఞ మీరకు
గురుసేవ మానకు!!
*********************************
గురువేసర్వం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి