సంతకాల వీలునామా;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
ఏదీ అంత సులువుగా వదులుకోలేం
అందుకే గతించిన 
కాలాన్ని కూడా జ్ఞాపకాల రూపాన నెమరవేసుకుంటూ ఉంటాం....

ఏదో విధంగా 
మాటల తవ్వకాలను జరుపుతూ 
నిన్నటి సాక్ష్యాలను సేకరిస్తూ ఉంటాం....

స్మృతుల జాబితాలను 
వివరంగా విశ్లేషిస్తూ
ఇరుగుపొరుగులతో కూడి కబుర్ల కాలక్షేపాన్ని చేస్తూ ఉంటాం...

మరిచిన గతాన్ని మరీ మరీ తలుచుకుంటూ
రాసుకున్న సంతకాల వీలునామాలను చర్చకు తెస్తూనే ఉంటాం.... 
కామెంట్‌లు