ప్రాచీన భారత్లో గోపబాలల ఆటలో గుండ్రంగా తిరుగుతూ ఆడిపాడటాన్ని రాస్ నృత్యం అనేవారు.దాన్నే నేడు దాండియా అంటూ బాలకృష్ణుని లీలలు అభినయిస్తారు.అందుకే కృష్ణుడిని రాస్ బిహారీ అని నార్త్ ఇండియా లో పిలుస్తారు.
రాత్రి హిండక్ అని హిందీలో అర్థం రాజాంతఃపురంలో రాత్రి కాపలాదారు అని.రాత్రంతా నిద్రపోడు.
ధర్మాంగదుడు విష్ణు భక్తుడు.నారదపురాణంప్రకారం అయోధ్యకు రాజు.ఇతనితండ్రిఋతుధ్వజుడు.ఇతను తపస్సు కైహిమాలయాలకు వెళ్లి విశ్వమోహిని అనే అప్సరస వలలో పడ్డాడు.హిమాలయాలనుంచి తిరిగి వచ్చి విశ్వనగరం నిర్మాత ఐనాడు.దాన్ని వెసనగర్ అని పిలిచేవారు.క్రమంగాభోపాల్ గా మారింది.
రుద్ర శబ్దార్ధం ఏడిపించే వాడు అని.ఏడ్పునించి తప్పించేవాడు.రుద్ర అంటే భయంకరం.రుద్రనించి రౌద్రం వచ్చింది.మత్స్య విష్ణు పురాణంలో సృష్టి ఆరంభంలో బ్రహ్మ కనుబొమల నించి వచ్చిన దైవం రుద్రుడు.ఈయనలోంచే భూతప్రేత పిశాచాలు ఉత్పన్నమయ్యాయి.బ్రాహ్మణ గ్రంధాల ప్రకారం వీరు పుడుతూనే పెద్ద గా ఏడ్వడం తోరుద్ర అని పిల్వబడ్డారు.అపార్థ అని కూడా అంటారు.మన్మధుని భస్మం చేసేప్పుడు శివుడు రుద్రావతారం ఎత్తాడు.11రుద్రులున్నారు.అజ ఏకశిలా వహిర్వుధన్య పినాకీ అపరాజిత్ త్రయంబక మహేశ్వర్ వృషాకపి శంభు హరణ్ ఈశ్వర్.రుద్రుని భార్య రుద్రాణీ🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి