అక్షర వర్షాలు కురిపించే
మేఘాన్ని నేను
పసితనాన్ని నందనవనం చేసే
అక్షర వర్షాన్ని నేను
మోడైన చెట్టును కూడా
చిగురించేలా చేసే
వసంతాన్ని నేను
ప్రతిభా పాటవాలను
లతలా అల్లుకునే
పూవల్లరిని నేను
మానవత్వపు పరిమళాలను మోసుకుపోయే
చంచల పవనాన్ని నేను
శోకతిమిరాలు ప్రసరించని
ఆనంద సౌధాన్ని నేను
సుఖాన్నీ, దుఃఖాన్నీ
ఆనందాన్నీ, విషాదాన్నీ
ప్రేమనూ, ద్వేషాన్నీ,
ఆశనూ, నిరాశనూ,
త్యాగాన్నీ, ద్రోహాన్నీ
సహాయాన్నీ, మోసాన్నీ
ఇలా ఎన్నింటినో
కవితలు కవితలుగా
కవిత్వీకరించే కవిని నేను!!
*********************************
నేను కవిని;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి