జిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం:
ఫ్యాఫ్టో , ఏపీ సిపిఎస్ ఈఏ ఆధ్వర్యంలో కొత్తూరు తాలూకా కేంద్రంలోశనివారం 



పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎస్ విధానానికి బదులు ప్రభుత్వం జిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఫ్యాప్టో నాయకులు దండు ప్రకాశరావు తెలిపారు..
ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఎమ్మెల్సీలతో కనీసం చర్చించకుండా ఉద్యోగ వర్గానికి తీవ్రంగా నష్టం కలిగించే జిపిఎస్ విధానం తీసుకురావడం ఉపాధ్యాయ, ఉద్యోగులను మోసం చేయడమేనని ఆయన అన్నారు..
వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి, నాలుగున్నర సంవత్సరాలు  కావస్తున్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా సిపిఎస్ కు బదులు జిపిఎస్ ను తీసుకురావడం లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయడమేనని ఏపీ సిపిఎస్ ఈఎ నాయకులు టి సూర్యరావు తెలిపారు..
ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25వ తేదీన జిల్లా కలెక్టరేట్లు వద్ద జరిగే నిరసన ధర్నాలను విజయవంతం చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
ఈ పోరాట కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు దండు ప్రకాశరావు, బోడ శ్రీను, కె.విజయ్ కుమార్, కె క్రాంతికుమార్, ఏపీటీఎఫ్ నాయకులు ఎం. శాంతారామ్, ఏపి సిపిఎస్ ఈఏ నాయకులు టి సూర్యారావు, శంకరరావులతో పాటు పెక్కుమంది ఉపాధ్యాయులు ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం
కొత్తూరు తహశీల్దార్ ఎం.చక్రవర్తికి వినతిపత్రాన్ని అందజేసారు.
కామెంట్‌లు