ధ్యానం;- Dr. అరుణకోదాటి- అరుణ రాగాలు ఆరుణోదయ అధ్యక్షురాలు- హైదరాబాద్
 సుకుమారం, సులభం, సరళం, సౌందర్య భరింతం సన్నిహితం అత్యున్నతమైనది  ధ్యానం! కఠినమైనది  కూడా ధ్యానమే
ఒక విషయం  తెలవడం  జ్ఞానం, తెలియక పోవడం అజ్ఞానం
నడిరాత్రి  తలుపులు  తీసి  సూర్యుడు  రమ్మని  ఆహ్వానిస్తే  రాడు,
మొక్కలు నాటగానే  పువ్వులు  పూయవు,
కాగితం, కాలం  చేతిలోకి  తీసుకోగానే  
కవిత్వం  రాదు,
అలాగే  ధ్యానం  మొదలు పెట్టగానే  గౌతమ  బుద్ధుడు, విశ్వా మిత్రులు  కాలేరు కదా!
అలా  అని  అజ్ఞానంతో  సమయం  గడపవద్దు.
చిట్టి రెక్కలతో  ఆకాశం లో  ఎగరడం  నేర్చుకున్న  పక్షి పిల్ల ఆకాశాన్ని  చూసి  నీలి తెర  అనుకుంది,
అందుకుందామని  ప్రయత్నిoచింది
ఎంతకీ  అందలేదు ఎంతో ఎత్తుకు  యెగిరి కిందికి  చూసింది 
కింద  పైన  కనపడిన  నీలితెర  కింద  కనిపించింది
ఎటువేపు  వెళ్లాలో  అర్ధం  కాలేదు
సముద్రంలో పుట్టిపెరిగిన  చేప సాగరం  లోతు
తెలుసుకుందామని  తిరిగితిరిగి  ముసలిదైనది. కానీ  లోతు  తెలుసుకోలేక  పోయింది.
వెలుగులో  ఉన్నంతసేపు  వెలుగు  విలువ  తెలీదు
చీకటి  మనకు  పరిచయ మైనప్పుడే  వెలుగు  విలువ  తెలుస్తుంది
ఆరోగ్యం  గా  వున్నప్పుడు  విలువ  తెలీదు అనారోగ్యం  బారిన  పడిన తరువాత  ఆరోగ్యం  విలువ తెలిసేది
అద్వైతం  అంటే  అర్ధం  తెలువాలంటే  ద్వై తం   విలువ , అర్ధం  తెలవాలి
ధ్యానం  అంటే  తెలవాలి  అంటే  ధ్యానం  కానిది  ఏమిటో  తెలియాలి
ధ్యానం  తెలవాలంటే  మన  మనసులోని  ఆలోచన  తెలుసుకోవాలి
మనసులో  ఎలాంటి  ఆలోచనలు  ఉండకూడదో  తెలుసుకోవాలి  మనసు  అంటే  సంచార ము ఎప్పుడూ  బయటి  విషయాల  మీదనే  ఉంటుంది.
ఆది  నిగ్రహించుకోవడమే  ధ్యానం
అంటే  మన  మనసును  , మనలోని ఆలోచనలను  నిగ్రహించుకోవడమే  ధ్యానం
ఈ ధ్యానం  అనేది  పైనవన్ని చెప్పినట్టు 
ఎక్కడో  వుండవు. మన  మనసు  లోనే కేద్రీకృతమై  ఉంటుంది.
అనేకానేక ఆలోచనల్ని  ధ్యానం  కప్పివేస్తుంది,
మన  ఆలోచనలని , కోరికలని  అదుపులో  ఉంచుకోవడమే  ధ్యానం,
అదే  మానసిక , శారీరక  ఆరోగ్య  సూత్రం


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం