రచయిత్రి ధనాశి ఉషారాణి కి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డు ప్రధానo


 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకారాపేటకు చెందిన ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి కి ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా  భాకరాపేట హైస్కూల్ నందు ప్రధానోపాధ్యాయులు శివకుమార్ మరియు ఉపాధ్యాయ బృందం పిల్లలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రధానo చేయడము జరిగింది. వివిధ నూతన ప్రక్రియలుతో సాహిత్యంలో సేవచేస్తూనే విద్యార్థులును  అభివృద్ధిలో నూతన కార్యక్రమాలును  నిర్వహణ చేస్తూ రేడియో కార్యక్రమంలుతో సాహిత్యంలో పాలు పంచుకుంటూనే విద్య అభివృద్ధికి కృషి చేసినందుకుగాను ఉపాధ్యాయులు పిల్లలు ఘనoగా సత్కరించడము జరిగింది.ఉపాధ్యాయులు శ్రీ కృష్ణయ్య  వినోద్ గారు గణేష్ కుమార్ మరియు వందనగారు అరుణగారు కల్పలత గారు శివలింగముగారు మొదలగు ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాలుపంచుకోవడము జరిగింది. గురువు గురించి చక్కని పాటను పాడటము జరిగింది గురువు గొప్పదనమును కవిత రూపములో వినిపించడము జరిగింది.పిల్లలు ఉపాధ్యాయ బృందము మెమెంటోతో సత్కరించడము జరిగింది
కామెంట్‌లు