చదవాలీ....చదవాలీ...(బాల గేయం)- రావిపల్లి వాసుదేవరావు- విజయనగరం-9441713136
చదవాలీ..చదవాలీ..!
ఏకాగ్రతతో చదవాలీ!
చదువులను చదివి మనం
ఉన్నత స్థాయికి చేరాలి!!

ఎదగాలీ..ఎదగాలీ..!
ఒదుగుతూ మనము ఎదగాలీ!
ఇష్టంతోనీ చదివి మనము
ప్రధమ స్థానం పొందాలీ!!


మరలాలీ..మరలాలీ..!
మంచి వైపుగా మరలాలీ!
దురలవాట్లు మానీ మనము
మంచి పౌరులుగా మారాలీ!!

కదలాలీ.. కదలాలీ..!
ముందుకు మనము కదలాలీ!
కష్టమునెదిరించీ మనము
లక్ష్యం వైపు చేరాలి!!

మెలగాలీ.. మెలగాలీ..!
ఆదర్శంగా మెలగాలీ!
చెడు స్నేహాలు మానీ మనము
క్రమశిక్షణతో మెలగాలీ!!

గెలవాలి.. గెలవాలీ..!
అన్నింట మనం గెలవాలీ!
గెలుపే ధ్యేయం చేసుకుని 
అందరి మనసులు గెలవాలీ!!

కామెంట్‌లు