ప్రేమలు పూయించెదము (బాల గేయం);- రావిపల్లి వాసుదేవరావు-9441713136

లోకంలో అందరినీ
సమదృష్టితో చూద్దాము!
ఇతరుల దుఃఖం తెలిసీ
మమతలును పంచుదుము!

పరనింద చేయకుండ
సహనం పాటించెదము!
స్వచ్ఛమైన యోచనతో
సౌఖ్యమును పొందెదము!!

అందరినీ ప్రేమిస్తూ
ఐక్యత సాధించెదము!
దురాశను విడనాడి
సన్మార్గం కోరుదుము!!

దూరదృష్టి కలిగుండీ
సమస్య పోగొట్టుదుము!
కళ్ళల్లో కరుణ నింపి 
శాంతి స్థాపన చేద్దాం!!

సానుభూతి చూపించి
స్వాంతన చేకూర్చుదాం!
జీవహింస చేయకుండా
ప్రేమలు పూయించుదాం!!


కామెంట్‌లు