అమ్మలకు అమ్మ- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 1923 వ సంవత్సరంలోనే  ఆమె నెల్లూరులో జిల్లా మహిళా సభను టంగుటూరి  హనుమాయమ్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించింది  పునకా కనకమ్మ గారి స్ఫూర్తితోనే తిక్కవరపు సుదర్శనమ్మ లాంటి ఉన్నత వర్గాల స్త్రీలు వీధులలోకి వచ్చారు  1927-28 సంవత్సరాలలో మదనపల్లి స్త్రీల సభలోను 27న వచ్చిన గాలివాన బాధితులను ఆదుకోవడంలోనూ రాయలసీమ క్షమ నిధికి  సమాజానికి విరాళాలు సేకరించడం లోను కనకమ్మ గారు ప్రముఖంగా పాల్గొన్నారు. నరసాపురానికి చెందిన లక్ష్మీబాయమ్మ బందరువాసి  మనపాక కమలమ్మలతో కలిసి చెన్న పట్నం రాజకీయ మహాసభలో ఆమె పాల్గొన్నారు.  పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రవేశపెట్టగా కనకమ్మ గారు సమర్థిస్తూ ప్రసంగించారు  1929లో మద్రాసులో డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి సమావేశంలో  12 తీర్మానాలు ఆమోదించబడ్డాయి.
అందులో రెండు తీర్మానాలు ఒకటి దేవదాసు వ్యవస్థ రద్దు రెండవది మద్య నిషేధం అమలు  వెంటనే చేయాలని కమలమ్మ గారు ప్రవేశపెట్టారు  ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఆచార్య రంగా గారి ప్రతిపాదన మేరకు పునకా కనకమ్మ గారు  రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఎంపికైనారు మరే స్త్రీ కి ఇలాంటి అవకాశం లభించలేదు. 1930 సంవత్సరంలో విదేశీ వస్త్ర బహిష్కరణలో కనకమ్మగారి బృందం  నెల్లూరులో గణనీయమైన పాత్ర వహించారు  నెల్లూరు పట్టణంలో కనకమ్మ గారు ఓరుగంటి మహాలక్ష్మమ్మ గారల 
దుకాణాల బహిష్కరణ ఆచార్య రంగా దేశోద్ధారక నాగేశ్వరావు పంతులు గారి  నుండి విశేష ప్రశంసలను అందుకున్నారు. ఆంధ్ర పత్రిక స్వతంత్ర పత్రికలు మెచ్చుకున్నాయి స్టోన్ హౌస్ పేట అంగళ్లు  చెక్కులు నిర్వహిస్తూ ఉండేవారు. సత్యాగ్రహులను వారు గౌరవంగా చూసేవారు నెల్లూరు బజార్లో వీధిలో ముస్లింలు ఇతరులు విదేశీ వ్యాపారం చేసేవారు. వారు సత్యాగ్రహములను దూషిస్తూ అవమానాల పాలు చేసేవారు. అయితే గాంధీజీ శిష్యుడైన వాడు సహనంతో అన్నీ భరించేవారు బద్దెన పెరుమూలనాయుడు మద్రాస్ శాసనసభ్యులు విదేశీ వస్త్ర బహిష్కారం జరిగే నాడు గమనించేందుకు నెల్లూరు వచ్చారు. ఆ కార్యక్రమాలలో మహిళలు అత్యంత సాహసం ప్రదర్శించారు  విదేశీ వస్త్ర బహిష్కరణలో ముమ్మరంగా పాల్గొన్న పునకా కనకమ్మ గారు  ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్లాలని నిశ్చయించుకుని కస్తూరి విద్యాలయ నిర్వహణకు తానులేని కాలంలో తగు ఏర్పాటు చేసి  సిద్ధంగా ఉన్నారు ఆమె  అందంగా ముప్పై సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో మొదటి ఉప్పు సత్యాగ్రహ శిబిరం మైపాడు లో ఏర్పాటు అయింది  ఆ రోజులలో బొమ్మశేశరెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా గుండవరపు హనుమారెడ్డి కార్యదర్శులు ఉండేవాడు.
కామెంట్‌లు