] శుభాలనూ సుఖాలనూ
విప్పిన మూటగా తెచ్చే
ఆకాశం ఆశల దుప్పటి కప్పుకుంది
పాలపిట్ట చూసింది నన్ను
పరవశమై పండుగ చుట్టేయ
దేహం కురిసిన వర్షంలో
తడిసిన నేలంతా చిటపట చినుకుల దసరా ధార
ఆకుపచ్చ జమ్మి ఆకు మోసూకొచ్చే ప్రాణాధార గాలిని
కవిత్వ పరిమళాన్ని
మోసుకుపోయే తడలు తడలుగా అదే ఊపిరి గాలి తనివితీరా
ఇంత పండుగ సందడి
మబ్బేసిన మసక నీలాకాశమై తోచే
యుధ్ధంలో అలసిన ముఖమేసి
అదేం చిత్రమోగానీ
చిరు కవితొకటి మెరిసింది నాలో చిరునవ్వుల మొగిలి పూల కలమై
అంతే
మనసు నిండిన ఆనంద నాట్యం నాలో
దసరా కళాకాంతి ఆడీ పాడే అవని
పండుగ నిండుగా కనులపండువ సాగే
ఆనందతీరాలు పాడుతూ
విజయమే హద్దైన నిర్విరామ నడకలో
పాలపిట్ట మంచి మనిషి శుభాకాంక్ష
Congrats to both the poet and publishwrs
Congrats to both the poet and publishwrs
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి