అల తిరుమల లడ్డు "కవి మిత్ర" శంకర ప్రియ., -సంచార వాణి: 99127 67098
  ⚜️శ్రీమద్ వేంకటేశ్వరుని
భువి వైకుంఠ వాసుని
      స్వామి వారి ప్రసాదము!
  ఓసుమతీ! ఓజోవతి! (1)                
⚜️అల తిరుమల లడ్డు
 శుచికి రుచికి పేరు!
     మహిమాన్విత మైనది!
  ఓసుమతీ! ఓజోవతి! (2)
           ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
⚜️శ్రీ వేంకటేశ్వర స్వామి.. పిలిచినవారికి పలికేదైవము! కొలిచినవారికి కొంగుబంగారం వంటి వాడు! ఆ తిరుమలేశ్వర స్వామి.. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడు! భక్తుల కష్టాలను తొలగించే మహా దేవుడు! శ్రీస్వామివారి దివ్య దర్శనమైన, తరువాత; భక్తులు.. స్వామివారి ప్రసాదమైన లడ్డులను తమతో పాటూ ఇంటికి తీసుకెళ్తారు. తమకు ఆత్మీయులైన బంధు మిత్రులకు, ఆ ప్రసాదంను భక్తి శ్రద్ధలతో పంచి పెడతారు;
⚜️శ్రీ స్వామి వారికి.. సుప్రభాత సమయంలో స్వామి వారికి నివేదన వెన్నతో మొదలు పెడతారు. పిదప, లడ్డూ, వడ, పోంగలి, దద్దోజనం, పులిహోరా, వడపప్పు, ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు. వీటిలో.. భక్తులకు లడ్డూల ప్రసాదం అంటేనే.. ఎంతో‌ ప్రీతిపాత్రమైనది ! అది.. ప్రసాదాలలో అగ్రస్థానంలో నిలిచింది.  శుచి , రుచి గలదిగా.. "తిరుమల లడ్డు" పేరెన్నిక గన్నది! అవి లేనిది "వీధి దుకాణపు లడ్డు" వంటిది!
 ⚜️శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో; తిరుమల లడ్డులకు కూడా అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది! శ్రీ స్వామివారికి.. ఈ లడ్డులను ప్రసాదంగా ప్రారంభించి; మూడు శతాబ్దములు పూర్తయ్యింది.స్వామివారి లడ్డు ప్రసాదoనకు.. దేవస్థానం వారు..పేటేంట్ హక్కు, ట్రేడ్ మార్క్.. సంపాదించారు! 
 ⚜️ "తిరుమలలోని లడ్డు గడుఁ దిక్తము నీవు దినంగ వద్దయా!" అను, సమస్యకు; పూరణ పద్యము!
        🚩 చంపక మాల 
     నరులను కష్టముక్తులుగ
నమ్మిన జేయును శ్రీనివాసుడే ;
    తిరముగ స్వామి పుష్కరిణి తీర్చు నఘమ్ముల ; తీయనైనదే
      తిరుమలలోని లడ్డు ; గడుఁ దిక్తము నీవు దినంగ వద్దయా
       అరగొర శుభ్రతన్ గలిగి యంగడి నిచ్చెడి వీధి లడ్డునే!
       👌"తిక్తము" అనగా చేదైనది, అని భావము!
[ రచన: శ్రీ జంధ్యాల జయకృష్ణ బాపూజీ.,]

కామెంట్‌లు