👌బ్రహ్మ చారిణి వీవె!
అక్ష మాలివి నీవె!
నవదుర్గా రూపిణి!
శ్రీమాతా శివాని!
( శ్రీమాత పదాలు, శంకర ప్రియ.,)
🔱శ్రీమాతా శివాని.. ఉమాదేవి. అందరినీ రక్షించునది. పార్వతీ మాత.. పరమేశ్వరుని భర్తగా పొందవలెనని నిశ్చయించు కొన్నది. తదనుగుణముగా, తీవ్రమగు తపమొనరించుటకు ; "బ్రహ్మచారిణి" గా బయలు దేరింది. అప్పుడా తల్లి అయిన మేనకాదేవి.. "ఉ" (ఓ బిడ్డా!).. "మా" ( వలదు ) అని, పిలిచింది. అందువలన, పరమేశ్వరికి .. "ఉ మా" దేవి అని పేరు వచ్చింది! తారక మహామంత్రమే.. "ఉమా నామము"!
🙏 " బ్రహ్మ"మనగా... జ్ఞాన, విజ్ఞానప్రదమైన, వేద స్వరూపము... పరమేశ్వరి. ఆ వేదమునందు సంచరించునది. కనుక "బ్రహ్మచారిణి" అని పేరు!
"ద్వితీయం బ్రహ్మచారిణి!" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిదిదుర్గా దేవీమూర్తులలో... రెండవది .. "బ్రహ్మచారిణి" దుర్గ!
🚩తేట గీతి పద్యము
అక్షమాల నీ కుడిచేత నమరియుండ,
ఎడమచేత కమండల మెపుడు నుండ,
బ్రహ్మవిద్యల బోధించు ప్రజ్ఞ యుండ,
దయ గనుము “బ్రహ్మచారిణీ!” తపము పండ!
(రచన:- అవధాని, కోట రాజ శేఖర్.,)
*****
🚩 చంపక మాల
కమలము వంటి హస్తముల కమ్రముగా జపమాలికన్ సదా
విమలమతిన్ ధరించియును ప్రీతిని గూర్చ ప్రసన్న దీక్షతో
శ్రమయని యెంచకన్ మదిని శంభుని గాంచ కమండలమ్ము తా
సుమతిని పట్టినట్టి సుర సుందరి కొల్చెద బ్రహ్మ చారిణిన్
(👌కమ్రముగా = మనోహరంగా)
( రచన:- డా. రఘుపతి శాస్త్రుల)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి