చంద్రఘంట దుర్గ "కవిమిత్ర" శంకర ప్రియ., శీ ల., సంచార వాణి: 99127 67098
 🔱చంద్ర ఘంటవు నీవె!
     ఆహ్లాద కరి వీవె!
     నవదుర్గా రూపిణి!
              శ్రీమాతా శివాని!
     ( శ్రీమాత పదాలు., శంకర ప్రియ.,)
🔱శ్రీమాత.. అభయ ప్రదాయిని! చంద్రుని శిరో భూషణముగా దాల్చినది, ఆహ్లాద కారిణీ దేవి. పరమేశ్వరి.. సమస్త మైన ప్రాణికోటికి, ఆహ్లాదమును అనుగ్రహించునది. అట్లే, సర్వేంద్రియము లకు ఉత్సాహమును, మనస్సునకు ఉల్లాసమును; మరియు, సాధకు లందరికి బ్రహ్మానందమును కలిగించునది. కనుక, దుర్గా మాతకు "చంద్ర ఘంట" అని పేరు.
🔱"తృతీయం చంద్ర ఘంటేతి!" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో మూడవది "చంద్ర ఘంట దుర్గ"!
    ఓం శ్రీదుర్గ! జయ శ్రీదుర్గ! జయజయ శ్రీదుర్గ!
    ( శ్రీదుర్గా దేవి షోడశ (16)నామ మాలిక.,)
       🚩తేట గీతి పద్యము
     ఆయుధమ్ములు పదిచేతు లందు నమర
    అర్ధచంద్రుండు ఘంటగా, నలరు తలను 
    శత్రులన్ ఘంట శబ్దమై, చంపు ధరను
     కావు మము “చంద్ర ఘంటాఖ్య” నీవు కృపను!
       (రచన:- అవధాని, కోట రాజ శేఖర్.,)
            🔆🪷🔆
    🚩 శార్దూల వృత్తం 
   చంద్రాకారము నందునన్ వెలుగునా సాక్షాత్ పరాదేవి ని
      స్తంద్రమ్మైన తమమ్ము నంతటిని నాశమ్మొందగా జేయుచున్
     సాంద్రమ్మైన సువర్ణ రూపమున నిచ్ఛాశక్తితో నొప్పు నా
       చంద్రాకారపు ఘంటరూపిణిని, నే శాకంబరిన్ గొల్చెదన్!
(👌నిస్తంద్రము = అలసట లేనిది చొరవ చూపునది)
    (రచన:- డా. రఘుపతి శాస్త్రుల.,)
కామెంట్‌లు