🔱స్కందమాతవు నీవె!
రక్షాకరివి నీవె!
నవదుర్గా రూపిణి!
శ్రీమాతా శివాని!
( శ్రీమాత పదాలు.,)
🔱స్కందుడు.. శ్రీశివ పార్వతుల కుమారుడు. ఎల్లప్పుడు బాలునిగా నుండువాడు. కుత్సితులను సంహరించు వాడు. కనుక, "కుమారస్వామి" అని పేరు. శ్రీమాత, పరమేశ్వరి.. రక్షాకరి. సన్మార్గులను కాపాడునది. స్కందునకు, (అనగా.. శత్రువులను శోషింప జేయు స్వామికి) తల్లి. కనుక, "స్కందమాత" అని పేరు.
🔱"పంచమం స్కంద మాతేతి!" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో.. అయిదవది "స్కంద మాత" దేవి!
🔆ఓం శ్రీదుర్గ! జయ శ్రీదుర్గ! జయజయ శ్రీదుర్గ!
(శ్రీదుర్గా షోడశాక్షరీ (16) నామ మాలిక.,)
🚩ఉత్పల మాల
స్కందుని మాతగా సకల కామ్యములన్ సమకూర్చ నెంచి మి
న్నందిన రీతులన్ గనుచు నైపుణితో తన భక్త జాలమున్
సుందర సింహ వాహనము శోభిల నొప్పి కరాబ్జ మందు ని
ష్యందమరందమున్ గను, యశస్విని గొల్చెద స్కంద మాతగా!
( డా. రఘుపతి శాస్త్రుల.,
******
🚩తేట గీతి పద్యము
బాలుడగు స్కందుడే, ఒడి లీల నుండ
రెండు చేతుల పద్మమ్ము లుండ, నీవు
పూర్తిగా వెల్గు చుందువు, కీర్తిచేత,
జనని! శుభముల గూర్చుమా! స్కందమాత!
(అవధాని, కోట రాజ శేఖర్.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి