🔱కాత్యాయనివి నీవె!
కామదాయిని వీవె!
నవదుర్గా రూపిణి!
శ్రీమాతా శివాని!
( శ్రీమాత పదాలు.,)
🔱శ్రీమాత.. కామితార్ధ ప్రదాయిని! సింహమును వాహనముగా కల్గినది, ఆరాధకులకు.. ఆమోఘఫల దాయిని! కాత్యాయనీ దేవి.. త్రిమూర్తులైన, బ్రహ్మ.. విష్ణు.. మహేశ్వరుల... దివ్య తేజస్సుతో.. "కాత్యాయన మహర్షికి పుత్రిక" గా, అవతరించింది.
⚜️కాత్యాయను డొక మహర్షి. ముక్తి మార్గము లెన్ని కలవని, విచారించువాడే... కత్యయనుడు. ఆ మహర్షి గోత్రము నందు పరాశక్తి పుట్టినది. కనుక, "కాత్యాయని" యైనది
🔱"షష్ఠం కాత్యాయ నీతిచ" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో ఆరవది .. "కాత్యాయనీ దుర్గ"!
🔆 ఓం శ్రీదుర్గ! జయ శ్రీదుర్గ! జయజయ శ్రీదుర్గ!
( శ్రీదుర్గా షోడశ (16) నామ మాలిక.,)
🚩 శార్దూల వృత్తం
గంభీరమ్మగు చంద్రహాసములతో కాంతుల్ ప్రసాదించుచున్
దంభమ్మొప్పెడు దుష్ట రాక్షసుల నంతమ్మొందగా జేయ, సం
రంభమ్మొప్ప త్రిలోకముల్ గనెడు దుర్గాదేవి కాత్యాయనిన్
శంభున్ రాణిని కొల్చుచుందు నెదనే శార్దూల వాహాన్వితన్!
[ డా. రఘుపతి శాస్త్రుల ]
******
🚩తేట గీతి పద్యము
ధరణి కాత్యాయన మహర్షి తనయ వీవె
యా త్రిమూర్తుల తేజమ్ము నంది నావు
యమున దరి గోపికల పూజ నలరినావు
మదిని దలతు, కాత్యాయినీ! మమ్ముఁ బ్రోవు!
[ అవధాని, కోట రాజ శేఖర్., ]
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి