మహాగౌరి దుర్గ!- "కవిమిత్ర" శంకర ప్రియ.," శీల., -సంచార వాణి: 99127 67098

 🔱మహా గౌరివి  నీవె!
     సౌభాగ్య దాయినివి!
     నవ దుర్గా రూపిణి!
              శ్రీమాతా శివాని!
     ( శ్రీమాత పదాలు.,)
🔱శ్రీమాత.. సర్వ మంగళ గౌరీదేవి. స్త్రీలందరికి .. సకల సౌభాగ్యములు ప్రసాదించుచున్న జగన్మాత!
     పార్వతీమాత.. పరమేశ్వరుని పతిగా  పొందవలయు నని; త్రీవ మైన తపస్సు కావించినది. అందువలన, ఆమె దేహము...  కృష్ణ ( నలుపు) వర్ణయైనది. పిమ్మట, ప్రసన్నుడైన శివుని దివ్యానుగ్రహము వలన, గౌర వర్ణ     ( బంగారు వన్నె) శోభిత యైనది. అందు వలన, "మహా గౌరి" అని, ప్రసిద్ధి కెక్కినది.
🔱"మహా గౌరీతి చాష్టమం" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో ఎనిమిదవది .. "మహా గౌరి దుర్గ"!
🔱ఓం శ్రీదుర్గ! జయ శ్రీదుర్గ! జయజయ శ్రీదుర్గ!
    ( శ్రీదుర్గాదేవి షోడశ (16) నామ మాలిక.,)
       🚩తేట గీతి పద్యము
    సాంబశివు గోరి, శ్వేత వస్త్రాల నమరి,
     పూజ్య మాతగ, వర చతుర్భుజగ నలరి
     యభయ హస్తగ, వృషభ వాహనగ దనరి
     వెలుగు నిన్ను "మహాగౌరి” కొలుతు చేరి!!
        
    [ అవధాని, కోట రాజశేఖర్ ]
           *********
  🚩 శార్దూలo వృత్తం
    గౌరీదేవిని సన్నుతింతు నెదనే కామ్యార్థ సంసిద్ధికిన్
    సారాలంకృత రూపిణిన్ శివుడు సాక్షాత్కార మొందంగ నిం
    పారన్ తెల్లని వస్త్ర సంతతుల నొప్పందాల్చి శ్వేతోక్షమే
    ఆరూఢిన్ గని, యెక్కినట్టి సతి సౌమ్యన్ ప్రార్థనల్ జేయుచున్
(👌శ్వేతోక్షమే = తెల్లని కాంతులను విరజిమ్ముతున్న వృషభాన్నైనా (నందికేశ్వరుని )
   [ డా. రఘుపతి శాస్త్రుల.,]
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం