"విద్యయా వర్ధతే వర్చో...!"- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల- సంచార వాణి: 99127 67098
  🪷విద్య వలన కలుగు
 బహుళ ప్రయోజనమ్ము!
    జ్ఞానము కోరువారికి
  ఓ బాలబాలిక లార!
🪷"విద్య" అనగా జ్ఞానము, విజ్ఞానము! వాటిని కోరువారే.. విద్యార్థులు! వాటివలన... ఆత్మ జ్ఞానము, భౌతిక విజ్ఞానములు జ్ఞానాభిలాషులకు.. కలుగు చున్నాయి!   
🪷విద్యవలన.. ముఖ వర్చసు, శరీర కాంతి వృద్ధిచెందుతుంది. విద్యచే పౌరుషం, ధీశక్తి కలుగుతుంది. ఆ విధంగా.. విద్య బాగా నేర్చుకొంటే అభివృద్ధి చెందనిది ఏది? అనగా, జ్ఞానము వలన అన్నీ గొప్పగా అభివృద్ధి చెందగలవు! ఓ విద్యార్థులార!
            🔆🪷🔆
     🚩తేటగీతి పద్యము 
    విద్యచే ముఖవర్చస్సు, వృద్ధి చెందు,
    విద్యచే దేహకాంతియు, వృద్ధి చెందు,
    విద్య నేర్వ, ధీశక్తియు వృద్ధి చెందు,
    విద్యచే నేది, భువి నభివృద్ధి గనదు?
        (తెలుగు సేత:- అవధాని, కోట రాజశేఖర్., )
కామెంట్‌లు