మధురానుబంధాలు;- డా. అరుణ కోదాటి- హైదరాబాద్ -9959878120
 అనుబంధాలన్నీ  ఆశాశ్వతమని
తెలిసినా  మనిషి
ఏర్పారుచుకుంటాడు కొన్ని బంధాలమీద ప్రేమ!

ధనం , కీర్తి మీద కొందరికి ప్రేమ అయితే,
పుట్టినఊరు, పెరిగిన ఇల్లు, కన్నవారు,
కట్టుకున్న  భాగస్వామి,
కన్న సంతానం, ఈనాలుగు జీవితాంతం పోగొట్టుకోకుండా ఉండగలగడం గొప్పవరం.

వీటిమధ్య కన్ను మూయగలగడం
ఒక అదృష్టం.
ఇల్లంటే  సున్నం, ఇటుక వంటి బౌతిక
పదార్థల మిశ్రమం కాదు,
శ్రమకు సంపదను వెచ్చించి నిర్మించిన సౌదం,


భార్య, భర్త లేని జీవితం పరిపూర్ణం  కాదు
అశ్వమేధ యాగంలో  రాముడు  సీతస్వర్ణ విగ్రహాన్ని పక్కన పెట్టుకుని, అశ్వామేద  యాగాన్ని చేసిన విషయం  విధితమే!
దాంపత్య జీవితం భారతీయ సమాజానికి
ప్రాకారం,
లోకంలో విలువలు మారిపోతున్నాయి, పుట్టిన ఊరిని,
జన్మనిచ్చిన తలిదండ్రులను మరిచిపోయే వికృత సంస్కృతిని చూస్తున్నాము
అవసరాలు  తప్పించి భార్య భర్తలు, మరే ఇతర సంబంధాలు కనపడని  పరిస్థితి  నేడు..! 

కామెంట్‌లు