కుచ్చుల జడ;- -గద్వాల సోమన్న,9966414580
అమ్మ సంతకు వెళ్ళింది
జడ కుచ్చులు తెచ్చింది
వాటితో జడ వేసింది
పాప ఎంతో మురిసింది

బడిలో జడను చూపింది
పిల్లలకెంతో నచ్చింది
కుచ్చుల జడను ఊపుతూ
గర్వంగా నడిచింది

పాప ఇంటికి వచ్చింది
జడ కుచ్చులు తీసింది
జాగ్రత్తగా వాటిని
పెట్టెలో దాచి పెట్టింది

పిల్లలకందమిచ్చును
జడలో ముద్దుగా అమరును
జడ కుచ్చులు బాలికలకు
సొగసులు తెచ్చిపెట్టును

కామెంట్‌లు