అందాలొలికే మా 'ఇల్లు'- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580.
అందాలొలుకు మా ఇల్లు
అనురాగాల పొదరిల్లు
ఆకాశాన హరివిల్లు
హాయిని గొల్పు విరిజల్లు

సమభావాల చిరుజల్లు
ఆనందాలు వెదజల్లు
స్నేహానికి మారుపేరు
అందరి క్షేమమది కోరు

పవిత్రమైన కోవెల
చిన్నారులతో కళకళ
నవ్వుల మోముల కిలకిల
ప్రేమ ఝరి పరుగుల గలగల

ఆదర్శాల మా ఇల్లు
ఆత్మీయతలకు పుట్టిల్లు
మనస్పర్థలకిక చెల్లు
అనుబంధాలనది అల్లు

మా ఇంటికి రారండోయ్!
దాని తీరు చూడండోయ్!
అందరూ కలిసి ఉంటే
స్వర్గధామం అదేనోయ్!!


కామెంట్‌లు