అమ్మ సోదరుడు మేనమామ
మా అందరికీ చందమామ
మా గృహం సందర్శిస్తాడు
బొమ్మలెన్నో కొనితెస్తాడు
ప్రేమెంతో కురిపిస్తాడు
మా హృదయాలు మురిపిస్తాడు
చల్లని తలపుల మేనమామ
వారి మనసు చూడ గగన సీమ
కథలెన్నో మాకు చెపుతాడు
బహుమతులు అందచేస్తాడు
జంతుశాలకు తీసుకెళుతాడు
వినోదాలు పంచిపెడుతాడు
ఆటలు,పాటలు నేర్పిస్తాడు
భుజాలపై మోసుకెళుతాడు
మాకిష్టమైన మేనమామ
వారంటే ఎనలేని ప్రేమ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి