శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 సంస్కృతం లో వంశంకి మూల అర్థం వెదురు.ఇంకో అర్థం కులం కుటుంబం.ఋగ్వేదంలో వంశం అంటే వెదురు అనే అర్థం లో వాడారు.వైదిక లౌకిక సంస్కృత సాహిత్యం లో వంశం అంటే వెదురు అనే అర్థం.ఋషి ఆచార్య పరంపరలో వెదురు అనే అర్థం.వైదికకాలంలో వెదురు వాడకం బాగా ఉండేది.ఇంటి పైకప్పు వెదురు తో చేసే వారు.వెదురు కణుపుల నుంచి కొత్త వి మొక్కలు వ స్తాయి.మనిషి సంతానం కూడా అలాగే వృద్ధి చెందుతుంది.
వకీలు అంటే వాది ప్రతివాది మధ్య కేసు నడుస్తుంది.ఈపదం అరబ్బీ పదం వావ్ కాఫ్ లామ్ ధాతువుల తో ఏర్పడింది.భరోసా ఇవ్వడం అప్పగించడం అనే అర్థం లో వస్తుంది.ఆధీనం అప్పగించడం అంటే ఖుదాకి సర్వస్వం అప్పగించడం 🌹

కామెంట్‌లు