అట్ల తదియ ;కె.కవిత-హైదరాబాద్
తెలుగింటి ఆడపడుచులు జరుపుకొను పండుగ..
ఆంధ్రులు జరుపుకొను పండుగ..
తెలుగు అందాలు వీనుల విందు చేయు పండుగ...
ఆరోగ్య పరమైన ఎన్నో అంశాలు నిండుగా ఉండే పండుగ...
ఉత్తరాది వారు కడువాచౌత్ పేరుతో జరుపుకొనే పండుగ...
కన్యలు మంచి వరుని కొరకు..
మహిళలు సౌభాగ్యం కొరకు చేయు పండుగ..
విదియ నాడు గోరింటాకు పెట్టుకుందురు..
తదియ నాడు గౌరి పూజ చేసెదరు..
కోడి కూయక మునుపే నిద్ర లేచి,స్నాన మాచరించి చద్ది అన్నము తినుట పండుగ ఆనవాయితీ....
రోజంతా ఉపవాసం..
సాయంకాలం అమ్మవారి పూజ చేసి.. చేసిన అట్లు 
ముత్తైదువులకు వాయినం ఇచ్చే ఆచారం..

ఎంతో సందడిగా ఆడవారంతా ఊయలలు ఊగుతారు...
ఆట పాటలతో ఉత్సాహం గా పాల్గొంటారు..
ఒకరితో ఒకరు సత్సంబంధాలు ఏర్పరుచుకొనుటయే
పండుగల ఉద్దేశము!!

కామెంట్‌లు