పని సర్దుబాటు బదిలీల్లో, వోని పాఠశాలకు తిరుమలరావు.

 నాలుగు నెలల క్రితం రాజాం నుండి, సాధారణ బదిలీపై కొత్తూరు కడుము ఉన్నత పాఠశాలకు వెళ్ళిన సాంఘిక శాస్త్రోపాధ్యాయులు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, నేడు పనిసర్దుబాటు పేరిట జరిగిన బదిలీల్లో పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం, వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు.  జూన్ నెలలో జరిగిన పదోన్నతి బదిలీల, సాధారణ బదిలీల అనంతరం పాఠశాలలందు గల విద్యార్థుల ఉపాధ్యాయుల సంఖ్య ప్రాతిపదికగా అవసరమైన చోట్లకు తాత్కాలిక బదిలీలు చేపట్టిన నేపథ్యంలో, తిరుమలరావుకు ఈ స్థానచలనం జరిగింది. 
ఈ మేరకు, శ్రీకాకుళం జిల్లా విద్యా శాఖాధికారి విడుదల చేసిన ఉత్తర్వులమేరకు,  కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు నుండి ఆయన రిలీవింగ్ ఆర్డర్ పొందారు. అనంతరం పాలకొండ మండల విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి, వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో  చేర్చుకోవాలంటూ వోని పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణికి నియామకపత్రాన్ని అందజేయగా, కుదమ తిరుమలరావు నియామకమైనారు.  
పాఠశాల ప్రధానోపాధ్యాయని బి.నాగమణి, సహోపాధ్యాయులు టి.శారదాకుమారి, జి.సూర్యనారాయణ, 
బి.పుష్పలత, ఎస్.వెంకటరమణలు తిరుమలరావును స్వాగతించీ శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రాప్తికి వందలాదిమంది ఉపాధ్యాయులకు ఈ పనిసర్దుబాటు బదిలీలు
దసరా శలవుల ముందు రోజున జరిగాయి. 
ఈ సందర్భంగా కుదమ తిరుమలరావు మాట్లాడుతూ కడుము ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కొత్తూరు మండల ఉపాధ్యాయులు ఈ నాలుగు నెలలూ చూపిన అభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని,  
ఈ వోని పాఠశాలలో కూడా విద్యార్థుల చదువుల స్థాయిని పెంపొందించేందుకు ఎప్పటివలే మరింత కృషి చేస్తానని అన్నారు. 
తిరుమలరావుకు పలువురు స్వాగత శుభాకాంక్షలు తెలిపారు.
కామెంట్‌లు