బతుకమ్మ పాటల సంకలనం ఆవిష్కరణ

 తెలంగాణ ఆదర్శ పాఠశాల,

బచ్చన్నపేట మండలం,

జనగామ జిల్లా.


తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల బచ్చన్నపేట ఇంటర్మీడియట్ విద్యార్థులు బతుకమ్మ పాటలను సేకరించడం జరిగింది.వాటిని ఒక సంకననంగా కూర్చి ఈ రోజు ప్రార్థనా సమావేశంలో పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె.కృష్ణవేణి గారు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది.ప్రపంచంలో ఎక్కడైనా పూలతో దేవుని పూజిస్తారు.కానీ  పూలనే దేవతగా భావించి పూజ చేసే విశిష్టమైన సంస్కృతి తెలంగాణాలో ఉంది. ప్రకృతితో మమేకమై జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. ప్రకృతిలో లభించే రంగురంగుల పూలను సేకరించి అందమైన బతుకమ్మగా అలంకరించడం బతుకమ్మ పండుగ ప్రత్యేకత.స్త్రీలు తొమ్మిది రోజులు ఆటపాటలతో ఆనందం బతుకమ్మ ఆటను ఆడుకొని బతుకమ్మలను చెరువులలో నిమజ్జనం చేస్తారు. గౌరమ్మ ప్రతిరూపమే బతుకమ్మ. తెలంగాణ స్త్రీల ఆచార సంప్రదాయాలతో, ఆనందోత్సవాలతో, వెల్లివిరిసే బతుకమ్మ పండుగ పూల పండుగ. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూలమయంగా ఉంటుంది. అడవుల్లో చేలల్లో తంగేడు పూలు,గుంగుపూలు, ముత్యాల పూలతో ప్రకృతి నాయనానందకరంగా ఉంటుంది.స్త్రీల సౌందర్యారాధనం,అలంకరణా నైపుణ్యం,కళాత్మక దృష్టి పూల బతుకమ్మను పేర్చడంలో ప్రదర్శితమవుతుంది. మహాలయ అమావాస్యనాడు ఎంగిలి పూల బతుకమ్మను పేర్చడంతో బతుకమ్మ పండుగ ఆరంభమై మహర్నవమి వరకు జరుగుతుంది.తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. సంగీతం,సాహిత్యం,నాట్యం మిళితమైన లాస్య నృత్యం బతుకమ్మ పండుగ. చందమామ,వలలో,కోల్,ఉయ్యాలో మొదలగు పల్లవులతో బతుకమ్మ పాటలు చప్పట్లు కొడుతూ  అడుగుల కదలికకు అనువైన పాటలు లయబద్ధంగా పాడుతూ బతుకమ్మ ఆటను  ఆడుతారు.స్త్రీల సౌభాగ్య ప్రదాయిని అయిన గౌరీ దేవియే బతుకమ్మ


కామెంట్‌లు