సుప్రభాత కవిత ; -బృంద
ధ్యేయమే తోడుగా
ధర్మమే వీడక
సహనమే నీడగా
సాగిపో నేస్తమా!

ఊహలే ఊపిరిగా
ఆశలే పందిరిగా
లక్ష్యమే శ్వాసగా
సాగిపో నేస్తమా!


జాలిలేని లోకాన
కోలుపోక  ఆశయం
రాలుపూలే తివాచీగా
సాగిపో నేస్తమా!

ఆలోచనే ఆలంబనగా
ఆవేదనే ఇంధనంగా
ఆదలను దాటుకుంటూ
సాగిపో నేస్తమా!

గుచ్చుకునే ముళ్ళున్నా
గుప్పుమనే పరిమళంతో
గుబాళించే గులాబీలా
సాగిపో నేస్తమా!

తట్టుకోలేని అడ్డంకులను
తప్పుకునే ఉపాయంతో
తరచి తరచి అడుగువేస్తూ
సాగిపో నేస్తమా!
 
నిజాయితీ గా నీవుంటే
నీతి తాను కాపుకాసి
నీకు రక్షణ ఇచ్చేలా
సాగిపో నేస్తమా!

అన్యాయం పైచేయిగా
అవినీతి  పెరిగితే
ఆత్మబలం తోడుగా
సాగిపో నేస్తమా!

గెలిపించే ధర్మం
నిలబెట్టే న్యాయంతో
నడిచొచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం