మహాదేవీ పరమేశ్వరీ
మహాదేవ ప్రియ సఖీ
మాలోని చైతన్యం నీవే
మాలోని నిద్రా నీవే!
మేము లోనయే మాయా నీవే!
మాలోని భ్రాంతీ నీవే!
మా లోని తృప్తివీ నీవే
మాలోని ఇచ్ఛవీ నీవే!
మా మనసులో ఉన్నదీ నీవే
మా బలానివీ నీవే!
అది తెలిసినా ఒప్పుకోని
అహం మాది....
అంతా మేమే అనుకుని
అన్నీ మెడకు చుట్టుకుంటాం
విడిపించుకోలేని చిక్కులు
ఏడిపించే సమస్యల లో
మమ్మల్ని మేమే నెట్టుకునేస్తాం
నిన్ను మేమే నిందిస్తాం..
శృతిమించిన స్వార్థం
అధికార దాహం తో
అధోగతి పాలవుతున్న
మానవత్వానికి
విజయం కలిగేలా
వెలుగులు నింపి
సత్యం గెలిచేలా
నిత్యం కాపాడమని
అపరాజితాదేవికి
అంజలి ఘటిస్తూ
విజయదశమి శుభాకాంక్షలతో
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి