మధ్యతరగతి;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మాకు 
రేపటి గురించి భయం
సంఘం గురించి భయం
మాలోదాగిన మా గురించి భయం
మాకు
తీరని సుఖాల ఆకలి
జాడ తెలియని ఆనందాలపై ఆశ
మేమంతా
సదా భయస్తులం
సమగ్ర బాధాగ్రస్తులం
మేమంతా
సంఘపు కట్టుబాట్లకు రక్షకభటులం
శిథిలాలయానికి పూజారులం
మేమంతా
మౌఢ్యంతో బలాఢ్యులం
అవివేకంతో అవినాశులం
బయటకురాలేని ప్రజలం
మేము
గతంలో కూరుకుపోయిన మనుష్యులం
గతకాలపు నీడలం
మేము
డైలీపేపరు తిరిగేసి
జాలీగా ఉన్నట్టు నటిస్తాం
మేము
ముక్కలైన గాజుపెంకులం
చెల్లాచెదురైన మూగముత్యాలం
మేము
వాచకంలో నీతులు వల్లిస్తాం
ఓపికలేనోళ్ళకు సహనాన్ని బోధిస్తాం
మరి మేం మధ్యతరగతి మనుషులం కదా!!
*********************************

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం