హైదరాబాదు త్యాగరాయ దాన సభలో కవి సమ్మేళనం;- వెంకట్ :మొలక ప్రత్యేక ప్రతినిధి
 

కవిత వినిపించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రీజినల్ కోఆర్డినేటర్   కవయిత్రి డాక్టర్ శారద వెంకటేశం కవిత ను అభినందిస్తూ సన్మానం చేసిన ప్రతినిధులు 
==============================================
భారతీయ జీవన విధానంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. వివిధ రూపాలలో భగవంతుడిని ఆరాధించేందుకు ఉపయోగపడటంతో పాటు భారతీయతలోని గొప్పదనాన్ని పండుగలు చాటి చెబుతున్నాయి. పవిత్రమైన పంచభూతాలతో కలకలలాడే ప్రకృతిని, ఆలమందలను దైవాలుగా కొలిచే విశేష విశిష్ట సంస్కృతి గల మన సంప్రదాయంలో పండుగలు అంతర్భాగంగా కనిపిస్తాయి. అంతేగాక నేడు పోటీ ప్రపంచంలో అంతరించిపోతున్న విలువల ధోరణిని కాపాడటంలో కూడా పండుగలు తనదైన పాత్ర పోషిస్తున్నాయి. భారతీయ సాంప్రదాయంలో దసరా, దీపావళి, బతుకమ్మ పండుగలకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది.
   విజయదశమి పండుగ ప్రతి సంవత్సవం ఆశ్వీజ శుద్ధ పార్టీ నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు 10వ రోజు విజయదశమి కలిసి పది రోజులపాటు దసరా పండుగ అంటారు. ఈ నవరాత్రులు ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి 10వ రోజు విజయదశమి జరుపుకుంటారు. చెడి మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ. క్రోధ. మధ. మాశ్చర్య, మోహ,లోభ, స్వార్ధ, అన్యాయం, అమానత, అహంకారం అనే పది దుర్ఘణాలను తొలగించుకొనుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గం. ఈ శరన్నవరాత్రులు విజయదశమి రోజు చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుకూడ .ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుని రాక్షసులతో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవరోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకుంటున్నారు. 
దసరా, బతుకమ్మలను పురస్కరించుకొని
తెలుగు భాష చైతన్య సమితి, తెలంగాణ మరియు త్యాగరాయగానసభ హైదరాబాద్ వారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన
దసరా, బతుకమ్మ పండుగ 
సంబరాలను పురస్కరించుకొని  త్యాగరాయ గాన సభ చిక్కడపల్లి, హైదరాబాదులో కవి సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో ప్రముఖ కవయిత్రి, రచయిత్రి అయిన డాక్టర్ శారద వెంకటేష్, రీజనల్ కోఆర్డినేటర్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, హైదరాబాద్, హెచ్. ఆర్. ఆర్. వెస్ట్. లో కొనసాగుతున్న వీరు పాల్గొని ప్రసంగించారు. అంతేగాక తాను  స్వయంగా బతుకమ్మ పై రాసిన  కవితను సభలో ప్రేక్షకుల మధ్య వినిపించారు. ఈ సందర్భంగా  కుసుమ ధర్మన్న కళాపీఠం చైర్మన్ గారు డా.. రాధా కుసుమ మరియు ఘంటా మనోహర్ రెడ్డి ప్రముఖ కవి, విమర్శకులు, శ్రీ దైవజ్ఞ శర్మ గారు సాంఖ్యాశాస్త్రం నిపుణులు, సరస్వతి ఉపాసకులు తదితర పెద్దల మధ్య డాక్టర్ శారద గారిని ఘనంగా సన్మానించారు. తన కవితలో బతుకమ్మ గురించే కాకుండా బడి పిల్లలకు  ఎలా నేర్పుతో ఓర్పుతో పాఠాలు నేర్పాలో క్షుణ్ణంగా వివరించడం ఆమె కవితా నైపుణ్యానికి గొప్ప తార్కాణం అని పలువురు పెద్దలు ప్రశంసలతో అభినందించారు.

కామెంట్‌లు