ఏమిటో?!
ఎక్కడ చూసినా
నువ్వే కనిపిస్తున్నావు
మాటల్లో చెప్పలేని
అందమైన అనుభూతిని
అందిస్తున్నావు
నా హృదయాన్ని చీల్చి
నీ బొమ్మను
చూపించనా ప్రియా?!
నా ఆఖరి నెత్తుటి బొట్టు కూడా
ఆలోచనకీ, ఆవేశానికీ మధ్య
సంఘర్షిస్తూ
నీకోసం అలమటిస్తోంది
ఏనాటికీ తీరని దాహంలా
పెరుగుతోంది నీపై ప్రేమ
ఆశ - నిరాశ
సుఖం - దుఃఖం
స్వర్గం - నరకం
అన్నీ! అన్నీ! అన్నీ!
అన్నీ నాలోనే ఉన్నాయి
నీకోసం పరితపిస్తున్నాయి
నీ ప్రేమే నాలోకం
అలౌకికం!!
*********************************
నాలోకం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి