ప్రథమవీక్షణ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చెలీ!
ప్రథమవీక్షణ క్షణంలో
నా కళ్ళల్లో నిండిన
నీ రూపం
నా కన్రెప్పలమాటున దాగి
సరాసరి
నా హృదయంలోకి జారింది
అప్పుడు నాగుండె
గొంతుకలోన కొట్లాడింది
ఇక 
నీ ప్రతిబింబపు ప్రకాశం
బ్రహ్మాండంలా నాలో నిండి
నా అస్థిత్వాన్ని సవాల్ చేసింది
నేను
ఏమీ చూసి
అనుభూతించలేని
గుడ్ఢివాణ్ణయ్యాను!!
*********************************

కామెంట్‌లు