సాన;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కత్తికి కలానికి
సానపడతా
వాడిని వేడిని
పెంచుతా

మణులకు మాణిక్యాలకు
సానపెడతా
ప్రమోదాన్ని ప్రకాశాన్ని
ప్రసరించుతా

మనసులకు మనుషులకు
సానబెడతా
మంచిని మానవత్వాన్ని
పంచిపెడతా

పలుకులకు ప్రేమకు
సానబడతా
అందాలను ఆనందాలను
అందజేస్తా

పిల్లలకు పెద్దలకు
సానపెట్టుతా
ఓర్పును  నేర్పును
పెంపొందిస్తా

గంధాన్ని
సానపడతా
గొంతులకు
రాచేస్తా

కత్తికి
సానపెడతా
కాయలను
కోసితినిపిస్తా

శాణముకి
సానపెడతా
రత్నాలకు
మిసిమినిస్తా

వజ్రానికి
సానబెడతా
మెరుగులను
చూపిస్తా

బాలలకు
సానపడతా
భావిపౌరులుగ
తీర్చిదిద్దుతా

విద్యార్ధులకు
సానపెడతా
తెలివితేటలను
తలలకెక్కిస్తా

ప్రేమకు
సానపెడతా
ప్రేయసికి
గాలమేస్తా

పలుకులకు
సానపెడతా
మాటలతో
మదులుదోస్తా

మనసుకి
సానపెడతా
భావాలను
రంగరించుతా

కలానికి
సానపెడతా
కాగితాలపై
అక్షరాలుచెక్కుతా

కవితలకు
సానపెడతా
పాఠకులను
పరవశపరుస్తా

కైతలను
సాగదీస్తా
కైమోడ్పులు
తెలియజేస్తా


కామెంట్‌లు